స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి.
నేటి సాక్షి,నర్సంపేట, జూన్ 27:నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక నగర్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మించనున్న స్థలాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల 200 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ లో పేద విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి అన్ని సౌకర్యాలతో 30 ఎకరాలలో విశాలవంతమైన అదునాతణమైన భవనాలు నిర్మించనున్నట్టు తెలిపారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అధికారులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





