Tuesday, March 10, 2026

పోలీస్ జాగిలాల నూతన గదులను ప్రారంభం

నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 27,

పేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం సుభాష్ రోడ్, పత్తి బజార్ కాలనీలోని పాత పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన పోలీస్ జాగిలాల నూతన గదులను (డాగ్ కెనాల్) ను పూజ కార్యక్రమం నిర్వహించి ఎస్పీ డాగ్ స్కాడ్ ఇంచార్జ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డిచే ప్రారంభింప చేశారు. అనంతరం పోలీస్ జాగిలాలు ఎస్పీ గారికి గౌరవ వందనం చేశాయి. ఎస్పీ గారు పోలీస్ అధికారులతో కలిసి ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… నారాయణపేట జిల్లాలో పోలీస్ జాగిలాల సౌకర్యార్థం నూతనంగా 6 గదులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పోలీస్ జాగిలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధునాతనంగా గదులను నిర్మించడం జరిగిందని ఈ సదుపాయాల ద్వారా పోలీస్ భద్రత మరియు సామాజిక సేవా సామర్థ్యం పెరుగుతుందని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. పోలీస్ జాగిలాలు పేలుడు పదార్థాలు కనుకొనడం, మర్డర్ కేసులను, మాదకద్రవ్యాలను చేదించడంలో దిట్టా అని, కేసుల ఇన్వెస్టిగేషన్లో పోలీస్ జాగిలాల సేవలను జిల్లా పోలీసులు వినియోగించడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. పోలీస్ జాగిలాలకు ప్రతిరోజు వ్యాయామం చేపిస్తూ మెను ప్రకారం సరైన డైట్ పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ లు నల్లపు లింగయ్య, మహేష్, ఆర్ ఐ నరసింహ, సీఐ శివ శంకర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, నరేష్, శివ శంకర్, మద్దయ్య జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News