నేటిసాక్షి ప్రతినిధి వేములవాడ:
వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన గొర్రె మైసయ్య ఇంటిలో గత వారం క్రితం జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఇల్లు అంతా పూర్తిగా దగ్ధమైంది.
ఈ విషాదకర ఘటన గురించి సమాచారం తెలుసుకున్న లింగంపేట గ్రామ వాస్తవ్యులు కొక్కుల నరేష్, కాదాసు రంజిత్,బొల్లెని మహేష్ లు కలసి ఆర్ధిక సహాయం అందించారు. కొక్కుల నరేష్ బాధితుడి ఇంటిని స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధిత మైసయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మనోధైర్యాన్నిచ్చారు.
ఈ కార్యక్రమం లో తర్రే ఆనంద్, ఎంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు.





