Tuesday, March 10, 2026

మాజీ డీఎంహెచ్ఓ సౌభాగ్య లక్ష్మీ అక్రమాలు,ఆస్తులపై సీబీఐకి పిర్యాదు చేస్తాం!

చుట్టాలు మంత్రులైతే అవినీతి పరులకు పోస్టింగులిస్తారా?

అవినీతి మయంగా మారిన ముఖ్యమంత్రి సొంత జిల్లా*

అవినీతి అధికారులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ

బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్

నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 27,

ముఖ్యమంత్రి సొంత జిల్లా నారాయణ పేట లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతి అధికారులకు అండగా నిలుస్తున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ వైద్య అధికారి అవినీతి,అక్రమ ఆస్తులపై సీబీఐ కి పిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) గా ఉండి తీవ్రమైన అవినీతి,అక్రమాలకు పాల్పడి రెండు సార్లు సరెండర్ అయిన డా” సౌభాగ్య లక్ష్మీకి మళ్ళీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ గా పోస్టంగు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.సొంత చుట్టాలు మంత్రులైతే అవినీతి అధికారులకు పోస్టింగులు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ నాయకులు అవినీతి అధికారులకు అండగా నిలుస్తున్నారని, జిల్లాను పూర్తిగా అవినీతి అక్రమాలకు అడ్డగా మార్చారని ఆరోపించారు.
రాజకీయ అండదండలతో జిల్లాను అవినీతి మాయం చేస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు.
తక్షణమే అవినీతి అధికారి సౌభాగ్య లక్ష్మీని జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ బాధ్యతల నుండి తప్పిoచాలని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News