Tuesday, March 10, 2026

మహాన్యూస్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

-బీసీ నేత ధనుంజయ నాయుడు డిమాండ్

నేటిసాక్షి, మిర్యాలగూడ :
మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై ఇటివల దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలను కఠినంగా శిక్షించాలని, బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ భవన్ లో బీసీ హక్కుల సాధన సమితి ముఖ్య నాయకులతో సోమవారం ధనుంజయ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ లో విస్తృ పోయే విషయాలు బయటపెట్టిన మహా న్యూస్..ఫోన్ టాపింగ్ కథనాలను జీర్ణించుకోలేక మహా న్యూస్ పై బిఆర్ఎస్ దాడి చేయడం సిగ్గు చేటు అన్నారు, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంపై దాడులు ఆందోళనకరని, బీసీ సంఘాల పక్షాన ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. కలానికి సంకెళ్లు వేయాలనే బిఆర్ఎస్ కుట్ర బహిర్గతం అయిందని, ఈ దాడి బిఆర్ఎస్ నాయకుల ఆగడాలకు నిదర్శనం అని,మహా న్యూస్ కార్యాలయ సిబ్బందిపై దారుణంగా దాడికి పాల్పడిన బిఆర్ఎస్ నాయకులు వెంటనే అరెస్ట్ చేయాలని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా మీడియా సంస్థల ఆస్తుల ధ్వంసం చేయడం సరైన విధానం కాదని, వాస్తవ కథనాలు ప్రచారం చేశారని తట్టుకోలేకనే దాడికి తెగబడ్డ బిఆర్ఎస్ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి నియోజకవర్గ నాయకులు చేగొండి మురళి యాదవ్, జ్వాల వెంకటేశ్వర్లు, దాసరాజు జయరాజు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News