నేటి సాక్షి (కరీంనగర్)
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు అచ్చె మురళి ఉద్యోగ విరమణ సన్మానోత్సవ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన పి.ఆర్.టి.యు టి.యస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అయిలేని కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇల్లందకుంట మండల శాఖ అధ్యక్షులు అచ్చె మురళి గారు గత 36 సంవత్సరాలుగా విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని సంఘ బాధ్యులుగా మండల శాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ లోకానికి అనేక సేవలు అందించారని కొనియాడారు.
ఉద్యోగ విరమణ అనంతర శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అసోసియేట్ అధ్యక్షులు పాకాల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిప్పని వెంకట్రాజం జమ్మికుంట మండల శాఖ అధ్యక్షులు పంజాల కృష్ణమూర్తి మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొక్కుల కేదారీశ్వర్,యాలం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు





