నేటిసాక్షి,గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్):
లోయర్ మానేరు డ్యామ్ లో ఆదివారం చేపలు పట్టడానికి వెళ్లిన గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు గువ్వ రవి గల్లంతయ్యాడు. అతని మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతదేహాన్ని మత్స్య కార్మికులు తెప్పపై ఒడ్డుకు తరలించారు. మృతదేహం లభ్యం తో కుటుంబ సభ్యుల రోదనలతో శోకసముద్రంలో మునిగిపోయారు.





