కొమురం భీమాసిఫాబాద్ ప్రతినిధి జూన్ 30
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని, రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో హోమ్ గార్డ్స్ ఇంచార్జ్ ఆర్.ఐ విద్యాసాగర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, హోమ్ హార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.





