ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం
నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:
( గుండ ప్రశాంత్ గౌడ్ )
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని మద్దునూర్ గ్రామంలో విద్యార్థులకు పాఠశాల భవనం, కనీస మౌళిక సదుపాయాలు అందుబాటులో లేవని మరియు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న ప్రస్తుత వర్షాకాలంలో గ్రామంలో ఒక్క ఆశా వర్కర్ కూడా అందుబాటులో లేరని మరియు అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు సైతం ఖాళీగా ఉండి గ్రామంలోని బాలలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారని కావున సంబంధిత అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవచూపి ఈ ప్రధాన సమస్యలను త్వరగా పరిష్కరించి మద్దునూర్ గ్రామ అభివృద్ధికి కృషచేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం రోజున జగిత్యాల జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) యందు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీచేసిన అభ్యర్థి మేకల అక్షయ్ కుమార్ వినతిపత్రం అందజేశారు.





