Tuesday, March 10, 2026

బిజెపి తెలంగాణ రాష్ట్ర రామచందర్ రావు నీ సన్మానించిన శ్రీరాముల యాదవ్

బిజెపి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ని.. ఘనంగా సత్కరించిన శ్రీరాములు అందెల

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం 2025లో భాగంగా రంగారెడ్డి జిల్లా మన్నెగూడ లోని వేదా కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడి ప్రకటన మహోత్సవంలో కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రివర్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల పరిశీలకురాలు శోభా కరంద్లాజే, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి , బండి సంజయ్, జాతీయ ఓబీసీ మోర్చా నాయకులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ , డీకే అరుణమ్మ , తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జి, తెలంగాణ బిజెపి ఇన్చార్జి అభయ్ పటేల్ జి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రంగారెడ్డి రూరల్ జిల్లా బిజెపి అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అభిమానుల అభిమానులు అందరి సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావుని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు నూతన అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుని ఘనంగా సత్కరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News