నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్
కళ్ళ ముందే కాయలు రాలుతున్నాయి.. రైతుల కళ్ళలో కన్నీరు కారుతున్నాయి..*
ధరలు లేక తోటల్లోనే వదిలేయడం.. పీకిన కాయలు అమ్ముడు పోక రోడ్లపైనే పారేయడం వంటి గడ్డు పరిస్థితులను ఎన్నడూ చూడలేదు…
మామిడికికనీసమద్దతు ధర ప్రకటించి అందరి రైతుల కొనుగోళ్లు చేయాలి…
*ఈ ఏడాదిలో టమోటా, కర్బూజా, దోస,నేరేడు తదితర పంటలకు ధరలే లేవు..వరి, వేరుశనగ ల ధరలూ ఆశాజనకంగా లేకపోవడం బాధాకరం...*
ఎకరా మామిడి కి రూ 20 వేలు పరిహారం అందించాలి..
రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా..అండగా నిలుస్తుంది…
సంబేపల్లె మండలం గుణ్ణికుంట్లగ్రామంలో ధరలు లేక కాయలు కోయకుండా వదిలేసిన మామిడి తోటలను పరిశీలించి, రైతుల బాధలు తెలుసుకుని , ధైర్యం చెప్పిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి.
మామిడి రైతులకు న్యాయం చేసి ఆదుకోవాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సంబేపల్లె మండలం గుణ్ణికుంట్ల గ్రామ పరిధిలో సర్పంచ్ దండు నాగభూషన్ రెడ్డి,రైతు క్రిష్ణారెడ్డి లకు చెందిన మామిడి తోటలను శ్రీకాంత్ రెడ్డి సందర్శించారు. ధరలు లేక చెట్లలోనే తోతాపురి, నీలం తదితర కాయలు అలాగే వదిలేయడంతో కాయలు మాగి నేలరాలాయి..కొన్ని చెట్లలోనే ఉండి రాలేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితులనుచూసి ఆయన చలించారు. ధరలు లేక పడుతున్న కష్టాలను ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటకుగిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల లాడుచున్నారన్నారు.గతంలో ఎన్నడూ చూడని విధంగా మామిడిని తోటల్లోనే వదిలేయడం, పీకిన కాయలు అమ్ముడుపోక రోడ్లపైనే పారేయడం వంటి గడ్డు పరిస్థితులను ఎన్నడూ చూడలేదన్నారు. తోతాపురి మామిడి కాయ ధరలు కిలోకు రూ 4 ఇవ్వక తోటల్లోనే రైతులు వదిలేస్తుండడం బాధాకరమన్నారు.కాయలను పీకి మార్కెట్ లకు తరలించినా కోతల కూలీలు, రవాణా ఖర్చులకు కూడా మిగలడం లేదన్నారు. ప్రభుత్వం రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఎకరా మామిడి చెట్లకు రూ 2500/- చొప్పున ఇన్స్యూరెన్స్ కట్టించుకున్నారని, కానీ రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. మామిడి రైతులకు ఎకరాకు రూ 20 వేలు పరిహారం తక్షణం చెల్లించి, శాశ్విత పరిష్కారం చూపాలన్నారు. వేరుశనగ, వరి, టమోటా, కర్బూజ,దోస తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు
ప్రతి మండల కేంద్రంలో మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ప్రతి మండల కేంద్రంలో మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలన్నారు.గుజ్జు పరిశ్రమను నియోజక వర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జూలై మొదటి వారం మొదలైందని, వర్షాలు కురవడం లేదని, వ్యవసాయపు బోర్లు అడుగంటుతున్నాయని, ఇక మామిడి చెట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలలో మామిడి రైతులకు మేలు జరిగిందన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఉచితంగా మామిడి మొక్కలు అందించి, 90 శాతం డ్రిప్ ఇవ్వడంతో రాయచోటి నియోజక వర్గంలో 20 వేల ఎకరాల మామిడి తోటలును రైతులు వేసుకున్నారన్నారు.ఈ ప్రభుత్వంలో పాలుకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. గత కొంతకాలంగా వరి, వేరుశనగ,టమోటా, ఖర్భూజ, దోస తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. సుమారు ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు వ్యవసాయాన్ని రైతులు మానేసారన్నారు.అటు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోనూ, ఇటు పెట్టిబడి చేతికి అందక రైతుల నష్టాలును మూటకట్టుకున్నారన్నారు.మామిడి కాయలు లోడ్లతో ఫ్యాక్టరీల ముందర రోజుల తరబడిరైతులు తిండీ తిప్పలు లేక నిరీక్షిస్తున్నారు. రైతుల పక్షాన ఎల్లవేళలా తోడుగా ఉంటామన్నారు. రైతులకు ఒక యేడాది రైతు భరోసా నిధులను కూటమి ప్రభుత్వం అంధించలేదన్నారు. త్వరలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం వచ్చి మామిడి రైతుల కష్టాలను తెలుసుకోనున్నారన్నారు.రాను రాబోయే రోజుల్లో జగన్ అధికారంలోకి వచ్చి, అప్పుడు కూడా మామిడికి ధరలు లేకున్నా ఉంటే కిలో మామిడిని రూ 10- రూ 15 మధ్యలో ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డి, వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, మాజీ డిసిసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబారెడ్డి,సర్పంచ్ దండు నాగభూషన్ రెడ్డి, ఎంపిటిసి శ్రీధర్ రెడ్డి, జె సి ఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి, అన్నారెడ్డి, రాయచోటి మండల లీగల్ సెల్ మాజీ సభ్యుడు యర్రపు రెడ్డి విశ్వనాథ రెడ్డి, చిట్టి శివారెడ్డి,మాజీ సర్పంచ్ సిద్దారెడ్డి, అమర నాథ రెడ్డి, అనీల్ రెడ్డి, నియోజకవర్గ బిసి సెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్,కొండారెడ్డి, భాస్కర్ రెడ్డి,యర్రపు రెడ్డి బ్రహ్మానంద రెడ్డి,శ్రీనివాసులు రెడ్డి, శేఖర్, మోటకట్ల జె సీబీ ప్రతాప్ రెడ్డి, వినాయక చికెన్ సెంటర్ పవన్ కుమార్ రెడ్డి,మల్లికార్జున రెడ్డి,వాయల్పాటి ఆనంద కుమార్ రెడ్డి,భూషణ్, మాధవరం రమేష్ రెడ్డి,నాని బార్ సిద్దారెడ్డి, రమణా రెడ్డి, పర్వత, శ్రీనివాసులు రెడ్డి, నాగిరెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు.





