నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2025 – అతిథిగా పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ ని తిరుపతి విమానాశ్రయం లో బిజెపి నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ జిల్లా కార్యదర్శి కాయం హరినాధరెడ్డి. మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ జిల్లా పార్టీ విషయాలపై కొద్ది సమయం చర్చించి తదుపరి రోడ్డు మార్గాన భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి బయలుదేరారు

