నేటి సాక్షి ప్రతినిధి చేవెళ్ల న్యూస్ చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులు, గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం.తంగడపల్లి గ్రామంలో ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి మంచి పేరున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. గ్రామంలో ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించే నైజం, అందరితో సన్నిహితంగా మెలగే స్వభావం ఆయన ప్రత్యేకత. గ్రామ ప్రజలు ఆయనను ఒక నాయకుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు.ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి తలుపు తట్టినా “నేనున్నాను” అంటూ ముందుకు వచ్చే సేవాభావం శ్రీకాంత్ రెడ్డికి సొంతం. గ్రామ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ భాగస్వామిగా నిలిచే వ్యక్తిగా ఆయనకు విశేషమైన ఆదరణ ఉంది.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ టికెట్ ఆశిస్తున్న శ్రీకాంత్ రెడ్డికి అవకాశం వస్తే, ఆయనను గెలిపించుకోవాలని గ్రామ ప్రజలు ఇప్పటికే మనస్పూర్తిగా కోరుకుంటున్నారని స్థానికులు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్న శ్రీకాంత్ రెడ్డి భవిష్యత్‌పై గ్రామంలో సానుకూల చర్చ కొనసాగుతోంది.

