నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~అన్నమయ్య జిల్లా -:- స్థానిక నియోజకవర్గ పరిధిలోనిములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్ ను టీడీపీ కి చెందిన వేపూరి కోట గ్రామ ఎంపీటీసీ మార్కిరి శ్రీనివాసులు రెడ్డి ఆయనతో పాటు టీడీపీ నాయకులు వేపూరికోట గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్ కుమార్, మాజీ ఎంపీటీసీ శేషారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె.వి.రమణ, కే. రమేష్ లు ఏకమై సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలవేసి దుశ్శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రతాప్ వీరికి ముఖ్య సూచనలిస్తూ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న అక్కడ మద్యం అమ్ముతున్న మాకు సమాచారం అందించాలని అలాగే గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మా దృష్టికి తీసుకురావాలని సూచనలు ఇచ్చారు. ~~~~~~~~~~~~~~~~~

