నేటి సాక్షి, అన్నమయ్య, శర్మ ~తాడేపల్లి -:- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ కమిటీల నియామకంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని పార్టీ నాయకులంతా ఫోకస్‌తో పనిచేయాలని పార్టీ క్యాడర్ కు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటివారం కల్లా కమిటీల నియామకాలు పూర్తవ్వాలని డేటా ప్రొఫైలింగ్ పక్కగా జరగాలని కమిటీల నియామకంపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ అందుబాటులోకి వచ్చిందని కమిటీల నియామకం కార్యక్రమం స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలని వైయస్ఆర్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలని అందరూ ఫోకస్‌తో పనిచేయాలని పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణమనేది కూడా అత్యంత ప్రాధాన్యమైందని ఇదివరకే పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా సజ్జల అన్నారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలని అధినేత జగన్ ఆదేశించారని ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలని విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలని డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలని డేటా ప్రొఫైలింగ్ సరిగా ఉంటే మనకు భవిష్యత్ లో అనేక ఉపయోగాలు ఉంటాయని పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుందనిదాదాపు 15 లక్షల మంది వైయస్ఆర్‌సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్దం చేశామని ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సోల్జర్స్ ను సిద్ధం చేసే కార్యక్రమంలో భాగమేనని ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారని కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇప్పటికే ఇస్తున్నామని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయని కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు కొందరితో టాస్క్ ఫోర్స్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకొని ఇది ఒక డ్రైవ్ లాగా చేయాలని నిర్ధేశించామని కమిటీల నియామకాలన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుందని సజ్జల అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు..~~~~~~~~~~~~~~~~~

