నేటి సాక్షి – రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పీహెచ్‌డీ పూర్తి చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పెండ్యాల విక్రమార్క సోమవారం దర్శించుకున్నారు. అనంతరం నర్మేట రమేష్ అడ్వికేట్ రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, అపద్బంధవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అక్కేనపెల్లి భాస్కర్ విక్రమార్కను రాజన్న శాలువాతో ఘనంగా సత్కరించారు. జిల్లా అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ, ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని పీహెచ్‌డీ సాధించి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడిగా ఎదగడం గర్వకారణమని పేర్కొంటూ విక్రమార్కకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కేనపెల్లి భాస్కర్, నర్మేట రమేష్ అడ్వికేట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నవీన్ అడ్వికేట్, గంగాధర్ అడ్వికేట్, సారన్న, అఖిల్, జహీర్, సుకుమార్, నవీన్ (లడ్డు), నరేష్ తదితరులు పాల్గొన్నారు.____

