నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 31దాహేగం.సిర్పూర్ నియోజకవర్గం దహేగం మండలంలోని భామనగర్,కొంచెం వెళ్లి.లో ఎమ్మెల్సీ .ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుంచవెల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సమావేశంలో .ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని గ్రామాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలగాలన్న గ్రామ అభివృద్ధి చెందాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని ఆయన అన్నారు త్వరలోనే సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధిపరిచే బాధ్యత తనదని ఆయన అన్నారు ఎన్నికలు కొన్ని రోజులే అని ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని ప్రభుత్వం చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీలో నడిచిన కార్యకర్తలకు నాయకులను కంటికి రెప్పలా పాడుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

