నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 10అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం , దిగువపల్లి పంచాయతీల్లో .శక్తి క్షేత్రం బోయకొండలో పలు ఫిర్యాదులపై విచారణ జరిగింది .కొండపై ప్రస్తుత ఈవో ఏకాంబరం పలు అవినీతి పనులు చేస్తున్నారంటూ రాష్ట్ర పాల ఏకిరిల చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు ,రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కు. ఫిర్యాదు చేశాడు దీంతో కాణిపాకం ఈవో పెంచల కిషోర్ .విచారణ అధికారిగా బోయకొండకు వచ్చారు ,తొలుత ఫిర్యాదు అయిన నాగేశ్వరరావును విచారించి అనంతరం ఈవో ఏకాంబరం ను. ఆయన విచారణ చేపట్టారు అదేవిధంగా పలువురు కొండ కింద అభివృద్ధి పనులలో భాగంగా గృహాలు కోల్పోయిన వ్యక్తులు నష్టపరిహారం, చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి కిషోర్ ను కోరారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చాయని ఈ సందర్భంగా వారు ,ఆయన దృష్టికి తీసుకువెళ్లారు వీటన్నింటిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం చేస్తానని ,ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మను దర్శించుకుని లడ్డూ పోటు ఇతర ప్రదేశాలలో ఆయన తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు,

