Saturday, May 9, 2026

*కామ్రేడ్ ఓంకార్ శతజయంతి సభ వాల్ పోస్టర్ విడుదల*

*నేటిసాక్షి, నల్లబెల్లి*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, అసెంబ్లీ టైగర్, ఎం సి పి ఐ(యు) వ్యవస్థాపకులు అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎం సి పి ఐ యు మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా కార్యదర్శి, సహాయ కార్యదర్శి దామ సాంబయ్య, మార్త నాగరాజులు మాట్లాడుతూ…ఈనెల 12 సాయంత్రం 4 గంటలకు నర్సంపేటలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో జరిగే ముగింపు సభను వరంగల్ జిల్లా రైతాంగం, కార్మిక, కర్షక, యువజన, మహిళా లోకం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పిలుపునిచ్చింది. కామ్రేడ్ ఓంకార్ 1972 నుంచి 1994 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చట్ట సభలను పోరాట వేదికగా మలుచుకున్నారన్నారు . భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో, ప్రజల హక్కుల కోసం అసెంబ్లీలో గర్జించిన అసెంబ్లీ టైగరని తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించిన మహానేత ఓంకార్ అన్నారు.ఆయన ఆశయాల సాధన కోసం, ఎర్ర జెండా పట్టి నడిచిన ఆ మహనీయుడి శతజయంతి సభను వరంగల్ జిల్లా ప్రజలంతా జయప్రదం చేయాలన్నారు .కామ్రేడ్ ఓంకార్ శతజయంతి ముగింపు సభకు నల్లబెల్లి మండలం నుండి వేలాదిమంది రైతులు, హమాలీలు, కూలీలు, మహిళలు తరలివెళ్లి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డి డబ్ల్యు మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ మార్తా సుధ, కనకం కోర్నల్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News