నేటిసాక్షి* మే 9 తిరుమలాయపాలెం(రుద్రరాజు)తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దీవెనలతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిని కొనసాగిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వహించడం జరుగుతుందని ఒకో మండలంలో మూడు సెక్టార్లుగా విభజించి ఫస్ట్ సెక్టార్లో సుమారు 10 నుంచి 12 గ్రామాలను తీసుకొని ప్రజలందరి సమక్షంలో ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో రాష్ట్ర జిల్లా అధికారులు మండల గ్రామస్థాయి అధికారులు పాల్గొని అక్కడే ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పలు శాఖల అధికారులకు అప్పగించి త్వరితగదన తమ సమస్యలను పరిష్కరించేందుకు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలో ఇప్పటికే రెండు సెక్టార్ లలో ప్రజా దర్బార్ ని నిర్వహించగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మూడో విడత సెక్టార్ ను 15 గ్రామ పంచాయతీల ప్రజా దర్బార్ ను శనివారం నిర్వహించారు.పాలేరు నియోజకవర్గంలో ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని ప్రజల నుంచి వచ్చిన ఎక్కువ ఆర్జీలలో భూ సమస్యలు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వృద్ధాప్య పెన్షన్లు పలు గ్రామపంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించి దరఖాస్తులు అందాయని అతి త్వరలో వాటి పరిష్కారానికి పక్కా ప్రణాళికతో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిపిఓ. రాంబాబు, జిల్లా వైద్యశాఖ అధికారి రామారావు, నీటిపారుదల శాఖ సిఈ. మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఈఈ. బాణాల రమేష్ రెడ్డి, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి, మాజీ ఎంపీపీలు కొప్పుల అశోక్, బోడ మంగీలాల్ నాయక్, మద్దిలపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, ఎంపీడీవో ఎస్ కే సిలార్ సాహెబ్, తాహసిల్దార్ లూథర్ విల్సన్, సర్పంచులు కామల్ల సువార్త నల్లమల్ల కీర్తి ధరావత్ సుజాత అజ్మీర నీలిమ గడిపుడి వెంకటనారాయణ కర్నాటి రాజేంద్రప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.





