నేటి సాక్షి, నారాయణపేట, జనవరి 13, , (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని యువకుమండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రమదాన కార్యక్రమం మరికల్ మండల కేంద్రంలోని వివిధ వార్డులలో మరికల్ యువకులు, గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు, మరికల్ యువకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరికల్ యువకమండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య, అఖిలపక్ష నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మరికల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్, మాజీ సర్పంచ్ గోవర్ధన్, మరికల్ మాజీ ఎంపీటీసీ గోపాల్, నాయకులు ఎల్. రాములు, రామకృష్ణ, గోవర్ధన్,బొంత మొగులయ్య, రామకృష్ణారెడ్డి, టైసన్ రాఘవేంద్ర, పెంట మీద రఘు, ల్యాబ్ నరసింహ, కురువ మల్లేష్, మరికల్ యువకమండలి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

