Tuesday, March 10, 2026

*జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి పర్వం బట్టబయలు** సత్యాలు మాట్లాడితే ఉలిక్కిపడుతున్నారు : జీవన్ రెడ్డి—-*

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )ఇందిరా భవన్‌లో ప్రెస్‌మీట్జగిత్యాల పట్టణంలోని స్థానిక ఇందిరా భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని తీవ్రంగా ఎండగట్టారు. సంజయ్ చేసిన అవినీతిపై వాస్తవాలు మాట్లాడితే ఉలిక్కిపడుతున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.*మున్సిపల్ పాలనలో అస్తవ్యస్తం*ఐదు సంవత్సరాల కాలంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఏకంగా 16 మంది మున్సిపల్ కమిషనర్లు మారారని, ఇది దేశంలో ఎక్కడా లేని పరిస్థితి అని జీవన్ రెడ్డి అన్నారు. ఇందులో ఎనిమిది మంది కమిషనర్లు జైలుపాలయ్యారని తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ కూడా వేధింపులు తట్టుకోలేక తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బలహీన వర్గాలు, మహిళలకు కేటాయించిన స్థానాల్లో కూడా వారి హక్కులను కాలరాస్తూ అన్యాయం చేశారని ఆరోపించారు.*రోడ్లు, మార్కెట్ అంశాలపై విమర్శలు*ఎల్‌ఎల్ గార్డెన్ 60 ఫీట్ల రోడ్ నిర్మాణంపై తాను అడ్డుకుంటున్నానని ఆరోపించడం అవాస్తవమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అన్ని కలెక్టర్లతో చర్చించి, ప్రజలను ఒప్పించి రోడ్డు వెడల్పు విస్తరణకు సహకరించానని తెలిపారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నవారే పాలన చేస్తున్నారని, అడ్డంకులు ఎవరు సృష్టించారని ప్రశ్నించారు.ఇంటిగ్రేటెడ్ వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభించి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదని, బిల్లులు రాలేదని చెప్పి దానిని సిమెంట్ గోదాంగా మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోయినా పట్టించుకోకుండా, కొందరిని మాత్రమే వెనుకేసుకుని రావడం ద్వంద్వ వైఖరేనని విమర్శించారు.*అభివృద్ధి పనులపై స్పష్టత*యావర్ రోడ్డుపై అక్రమ, అనుమతులకు విరుద్ధమైన నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తన వంతు బాధ్యతగా ఈ చర్యలు తీసుకున్నానన్నారు. ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేసిన వెంటనే కలెక్టర్ 100 కోట్ల నిధుల కేటాయింపుకు ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో 2004లో జగిత్యాల ప్రజలకు 25 కోట్లతో త్రాగునీటి సరఫరా నిధులు మంజూరయ్యాయని, కేసీఆర్ వంతెన నిర్మాణానికి 70 కోట్లు ఇచ్చారని తెలిపారు. అయితే గత ఐదేళ్లలో మున్సిపల్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని ఆరోపించారు.*కాంగ్రెస్ కార్యకర్తల హక్కులపై పోరాటం*ఉమ్మడి రాష్ట్రంలో జేఎన్‌టీయూ, వ్యవసాయ కళాశాల, ఎన్‌ఏసీ సెంటర్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను జగిత్యాల‌కు తీసుకువచ్చామని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 200 రూపాయలకే నల్ల కనెక్షన్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు టికెట్లు దక్కాలని, వారి శ్రమను దోచుకునే వారిని సహించబోమని హెచ్చరించారు. తాను అడ్డుకుంటున్నానని ఆరోపించడం అసత్యమని, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని తాము పట్టించామని స్పష్టం చేశారు.——–

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News