*నేటి సాక్షి-మేడిపల్లి* *మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి*ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మేడిపల్లి వారి ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో ఆర్బీఐ అక్షరాస్యత కేంద్రం మేడిపల్లి వారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలు -ఆర్థిక మోసాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా యువత సైబర్ నేరాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ అప్స్ వల్ల సైబర్ నేరాలకు గురవుతున్నారని, ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ని డౌన్లోడ్ చేయవద్దని, డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే కాల్స్ కి బయపడవద్దని,యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు ఆకర్షితులవున్నారని, ఎటువంటి లోన్ యాప్స్ లో లోన్ తీసుకుని జీవితాలను దుర్బరం చేసుకుంటున్నారని అన్నారు.మీకు సైబర్ మోసానికి గురి అయినట్లు తెలిసిన వెంటనే 1930 నెంబర్ కు కాల్ చెయ్యాలని అన్నారు.ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుని కొంతమంది తెలిసిన వాళ్ళలా మాట్లాడుతూ యూపీఐ ల ద్వారా డబ్బులు అడిగితే పంపవద్దని సైబర్ మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని,1930 నెంబర్ అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ఎస్సై శ్రీధర్ రెడ్డి, భీమారం గ్రామ సర్పంచ్ స్వాతి సంజీవ్ ,ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మేడిపల్లి కౌన్సిలర్లు నవీన్ ,మేఘమాల, భీమారం గ్రామ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు గ్రామ ప్రజలు యువకులు తదితరులు హాజరయ్యారు.





