*నేటి సాక్షి-మేడిపల్లి* మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లిలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు రాబోయే ఫిబ్రవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా మూడవ తరగతి పిల్లలకు జరిగే సర్వే FLS (ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ) ఉంటుందని దీని కొరకు మూడవ తరగతి విద్యార్థులకు ఇప్పటినుండే సన్నద్ధం చేయాలని FLS లో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ D. గోవర్ధన్, M.రోజా రాణి, ఆంగ్లంలో గణితంలో పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పవచ్చు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది . ఇట్టి కాంప్లెక్స్ సమావేశానికి మండల విద్యాధికారి ఆకుల లక్ష్మి నర్సయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ హమీద్, మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన జరిగే సర్వేలో పిల్లలను ఇప్పటినుండే సన్నద్ధం చేయాలని దాని కొరకు మనమంతా కష్టపడి మన జగిత్యాల జిల్లాలోని మన మేడిపల్లి మండలాన్ని మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. ఇట్టి సమావేశానికి రిసోర్స్ పర్సనల్ గ గోవర్ధన్, రోజా రాణి, సి ఆర్ పి చంద్రశేఖర్, మండలంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





