Tuesday, March 10, 2026

ధన్వాడ మండలంలో. గుట్టలను తవ్వేస్తున్నారు… 24 గంటలు కొనసాగుతున్న టిప్పర్లు….. గ్రామీణ రహదారులు అద్వానం….. పట్టించుకోని ధన్వాడ మండల అధికారులు…. రాత్రి పగలు కొనసాగుతున్న టిప్పర్లు…..!? నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్….

నేటి సాక్షి,నారాయణపేట జనవరి 28,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలో ప్రభుత్వ వనరులు అయిన గుట్టలను విచ్చలవిడిగా రాత్రి పగలు తవ్వేస్తున్నర నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ ఆరోపించారు. ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వనరులైన గుట్టలను తవ్వేసి భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాత్రనక పగలనక విచ్చలవిడిగా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపించారు. గుట్టలంతా వేసి కొనసాగడంతో రోడ్లు అద్వానంగా మారుతున్నాయని ఆయన ఆరోపించారు. టిప్పర్ల నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఈ టిప్పర్ల ద్వారా ప్రమాదాలు జరిగే టిప్పర్ల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ధన్వాడ మండలం కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న గుట్టలను తోవేస్తున్న అధికారులకు వివరించిన పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వనరులైన గుట్టలను జిల్లా స్థాయి అధికారులైన స్పందించి కాపాడాలని ఆయన కోరారు. వెంటనే ధన్వాడ మండల కేంద్రంలో కొనసాగే టిప్పర్లను నిలిపివేయాలన్నారు. ధన్వాడ మండల కేంద్రంలో రాత్రి పగలు కొనసాగుతున్న టిప్పర్లను వెంటనే నిలిపివేయాలని లేనియెడల ధన్వాడ మండల కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. మేము టిప్పర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు… ధన్వాడ మండల తాసిల్దారు సింధుజ…. ధన్వాడ మండల విచ్చలవిడిగా కొనసాగుతున్న మొరం టిప్పర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ధన్వాడ మండల సింధుజ నేటి సాక్షి రిపోర్టర్ కు వివరించారు. ధన్వాడ మండలంలో కొనసాగితే వాటిపై చర్యలు తీసుకుంటామని మండల తాసిల్దార్ సింధుజ హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News