Tuesday, March 10, 2026

ఇందిరానగర్‌లో అస్తవ్యస్తమైన సీసీ రోడ్డు

నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ 3వ వార్డులో గత రెండు నెలల క్రితం మరమ్మత్తుల నెపంతో సీసీ రోడ్డు మరియు లోకల్ వాటర్ పైపులైన్‌ను పగలగొట్టి వదిలేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో కాలనీవాసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.మూడో వార్డులోని ప్రధాన సీసీ రోడ్డుపై అనుకోని ప్రైమరీ స్కూల్ ఉండటంతో విద్యార్థుల రోజువారీ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుపై తవ్వి వదిలేసిన గుంతల వల్ల చిన్నారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.అదే విధంగా అత్యవసర సమయాల్లో అవసరమయ్యే 108 అంబులెన్స్‌లు, ఇతర సేవా వాహనాలు రాకపోవడం కాలనీవాసుల్లో భయాందోళనలకు కారణమవుతోంది.ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఇదే ప్రాంతానికి సమీపంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనుండటం. గుంతలు, ధ్వంసమైన రోడ్డు కారణంగా ఓటర్లు పోలింగ్‌కు వచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులు, మున్సిపల్ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకుని సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఇందిరానగర్ కాలనీ వాసులు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News