నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగిత్యాల మరియు రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఘన విజయం దిశగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.అనంతరం జగిత్యాల మరియు రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి గా ఎన్నికైన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మరియు రాయికల్ పట్టణ ముఖ్య నాయకులు కలిసి సన్మానించారు.ఈ సమావేశంలో రాయికల్ పట్టణ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





