Tuesday, March 10, 2026

కేసీఆర్ సహకారంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌లో వందల కోట్ల అభివృద్ధి : స్వప్న సురేష్

నేటి సాక్షి గజ్వేల్ :మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని ఆరో వార్డు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బొగ్గుల స్వప్న సురేష్ అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఆరో వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు, మాతా–శిశు ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, మహతి ఆడిటోరియం, సమీకృత కూరగాయల మార్కెట్, ప్రజ్ఞాపూర్ నుంచి తూప్రాన్ వరకు ప్రధాన రహదారి సుందరీకరణ, పాండాల చెరువు అభివృద్ధి వంటి కీలక పనులు కేసీఆర్ పాలనలోనే జరిగాయని పేర్కొన్నారు.కేసీఆర్ గారి మానసపుత్రిక అయిన కేజీ టు పీజీ విద్యా సౌధం ఏర్పాటు ద్వారా నిరుపేదలకు నాణ్యమైన విద్య అందుతోందని, పుట్టిన ఆడబిడ్డ నుంచి వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గత 60 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి కేసీఆర్ పదేళ్ల పాలనలో సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు.రాష్ట్రంలో ప్రస్తుతం అధికారం కోల్పోయినా, తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆరో వార్డు ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఈదుగాని యాదగిరి, గుండ్ర రామచంద్రం, దాకాని బిక్షపతి, రొట్టెల శ్రీనివాస్, దొమ్మాట కనకయ్యతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News