నేటిసాక్షి, మిర్యాలగూడ (జనవరి 29) : గత 10ఎడ్లల్లో మిర్యాలగూడలో మేము చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రెడ్డి కాలనీలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మిర్యాలగూడ పట్టణాన్ని గత పదేళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామని, చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని ప్రజలను కోరుతున్నాం అన్నారు. పార్టీ క్రమ శిక్షణకు లోబడి పనిచేసే వారికే ఈసారి అవకాశం కల్పించామని, అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 48 వార్డులకు గాను 38 వార్డుల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త, అధికారికంగా విడుదల చేశారు. అనంతరం, ప్రకటించిన అభ్యర్థులకు ఎన్నికల నామినేషన్ పత్రాలను అందజేశారు.అనంతరం బీఆర్ఎస్ మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో గులాబీ జెండా ఎగిరేలా సమిష్టిగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ తిప్పన విజయ సింహ రెడ్డి, యువనేత నల్లమోతు సిద్ధార్థ, యదవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నభిమోజు నాగార్జున చారి, నారాయణ రెడ్డి, వీరకోటి రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, కరుణాకర్ రెడ్డి, బాబయ్య, మక్డుం పాషా, ఇలియాజ్, మాజిద్, కట్టా మల్లేష్ గౌడ్, పిస్కే ప్రసాద్, బిక్షం గౌడ్, అశోక్ రెడ్డి, హతిరాం నాయక్, బాలు నాయక్, కోలా రామస్వామి తదితరులు పాల్గొన్నారు.





