నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )జగిత్యాల పురపాలక సంఘ ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల గంజ్ ప్రాంతం 48వ వార్డు కౌన్సిలర్ పదవికి బీజేపీ అభ్యర్థిగా కొండ అరుణ లక్ష్మణ్ శుక్రవారం తన నామినేషన్ పత్రాన్ని అట్టహాసంగా దాఖలు చేశారు.నామినేషన్ సందర్భంగా జగిత్యాల వీధులన్నీ కాషాయ జెండాలతో, నినాదాలతో జనసంద్రంగా మారాయి. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు అరుణ లక్ష్మణ్ వెంట ఊరేగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ శ్రేణుల ఉత్సాహంతో పట్టణం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.*అభివృద్ధే ప్రధాన లక్ష్యం*నామినేషన్ అనంతరం కొండ అరుణ లక్ష్మణ్ మాట్లాడుతూజగిత్యాల పట్టణ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, జగిత్యాల మున్సిపల్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణానికి చెందిన పెద్దఎత్తున వంజరి సంఘం నాయకులు, కులస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొని అరుణ లక్ష్మణ్‌కు తమ మద్దతు ప్రకటించారు.___





