Monday, March 9, 2026

*ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతి వేడుకలు* మంచిర్యాల జిల్లా,, జనవరి 31

నేటి సాక్షి చెన్నూర్ లో ఐ ఎఫ్ టి యు డివిజన్ కమిటీ మాసాని రమేష్ ,ఘనంగా పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు నిర్వహించరురమేష్ మాట్లాడుతూ. తన పాటలతో కోట్లాది జనం గుండె చప్పుడు అయ్యాడని కాలేదాయన, ఆచరణ ప్రక్రియకు వెనుకాడక అజ్ఞాతంలోకి వెళ్లి సంవత్సరాల పాటు ఉద్యమ యుద్ధరంగంలో సైనికుడై ముందుండే వాడని అందుకే తిరిగి మైదానంలోకి అడుగిడినా ప్రజాసైనికుని పాత్ర నిర్వహిస్తూ వచ్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి జ్ఞాపకం.అని రమేష్ అన్నారు,దళిత రచయిత గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. వారికి గద్దర్ అనే పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన “గద్ధార్ పార్టీ గుర్తుగా పెట్టుకోవడం జరిగిందన్నారు,గుమ్మడి విఠల్‌ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948 లో దళిత కుటుంబంలో జన్మించారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాబ్యాసం చేసిన గద్దర్. ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్‌లో చదివి,ఆంధ్రమహాసభ ఉద్యమస్ఫూర్తితో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉబికి వచ్చినట్టే, 1969 ఉద్యమం మిగిల్చిన నిరాశానిస్పృహల నుంచి విప్లవోద్యమ లావా ఎగిసిపడిందన్న అవగాహన ఉన్నవారు. భావ వ్యాప్తికోసం ఊరురా తిరిగి ప్రచారం చేశాడన్నారు,ఆయన అనేక పాటలు రాసారని. 1972 లో జననాట్య మండలి ఏర్పడి పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసి కెనర బ్యాంకులో క్లార్క్ గా ఉద్యోగం సంపాదించారు. తర్వాత వివాహం చేసుకున్నారని భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల ఉన్నారు.• జీవితం తొలి దశలో గద్దర్ 1980లలో విప్లవ కారుడిగా అజ్ఞాత జీవితం గడిపారు.అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ సభ్యులు గా ఉండేవారు. ఆ పార్టీ యొక్క సాంస్కృతిక విభాగంలో భాగం అయ్యి విస్తృతంగా ప్రజల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. 1997లో గద్దర్ మీద హత్య యత్నం విఫలం అయ్యిందాన్నారుమాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి.1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. గోచి,గొంగళి ధరించేవాడని ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయన్నారు దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.చరిత్రలో మార్పు కోసం కృషి చేసిన చరిత్రపురుషునిగా గద్దర్‌ సుస్థిరంగా వుంటాడని అన్నారు, ఈ కార్యక్రమం లో ఎగుడ సాయి, అది, అశోక్, సిపిఎం.బోడంకి చందు,నగేష్ సభ్యులుహాజరయ్యారు, మోటార్ వర్కర్స్ యూనియన్ చెన్నూర్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News