Monday, March 9, 2026

ఘనంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి 78వ జయంతి వేడుకలునివాళులు అర్పించిన ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్

నేటి సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ :ఆసిఫాబాద్ పట్టణంలోని అజ్మీరా శ్యామ్ నాయక్ గారి క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా యుద్ధ నౌక, విప్లవ గాయకుడు గద్దర్ గారి 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ గారు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన, పీడిత వర్గాల గొంతుకగా తన పాటలతో, మాటలతో ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప సామాజిక ఉద్యమ కారుడు గద్దర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలు, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News