నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 31 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారుఆంధ్ర ప్రదేశ్ ను నవ్యాంధ్ర ప్రదేశ్ గా అడుగుగులు వేసే దిశగా కాలుష్య నివారణలో భాగంగా ప్రభుత్వం ఇ-సైకిల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వాహింఛింది. 36,000 వేల రూపాయలు గల సైకిల్ ను 24,000 కే ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగా *చౌడేపల్లి మండల* కేంద్రం నందు గౌరవ మండల అధ్యక్షులు *శ్రీ గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) గారు* మరియూ మండల అభివృద్ది అధికారిని గౌరవనీయులు *శ్రీమతి లీలా మాధవి గారు* చేతుల మీదుగా లబ్దిదారులకు ఇ-సైకిల్ ను పంపిని చేసారు. అనంతరం రమేష్ రెడ్డి గారు మాట్లాడుతు ప్రభుత్వం అందిస్తున్న రాయతీతో కుడినా ఇ-సైకిల్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దీనివల్ల కలుష్య నివారణ జరిగి ఖర్చులు తగ్గి డబ్బు ఆదా చేసుకోవచ్చు అని తేలిపారు. కార్యక్రమములో APO సుబ్రహ్మణ్యం గారు, వెలుగు సమాఖ్య మహిళలు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





