నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 31మండలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో ఏడుగురు గాయపడ్డారు.గడ్డంవారిపల్లి గ్రామపంచాయతీ, తెల్లనీళ్ళపల్లి సమీపంలో చౌడేపల్లి వైపు వస్తున్న ఆటో బోల్తా పడి ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారి వివరాలు మొడుకూరు కు చెందిన రెడ్డెప్ప(75)కు ఎడమకాలు విరిగినది. లక్ష్మమ్మ(65)కు తలకు గాయమైనది. గంగవరం మండలం దండపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్(10) కు ముక్కు తగిలినది.రమణమ్మ(40)కుఎడమ చెయ్యి విరిగినది,దొనపల్లికి చెందిన చంద్రప్ప(70)కు చెయ్యి, పరికిదొన కు చెందిన వెంకటమ్మ(70) కు చెంపకు గాయాలయ్యాయి.అలాగే దుర్గసముద్రం గ్రామపంచాయతీ,గాండ్లపల్లికి చెందిన శివ భార్య గుర్రమ్మ తన పిల్లలను పాఠశాల నుండి ఇంటికి పిలుచుకొని వస్తున్న క్రమంలో చారాల బస్టాండ్ నందు బస్సుదిగి రోడ్డు దాటుతుండగా శ్రావ్య ను చౌడేపల్లి వైపు నుండి పలమనేరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం వేగంగా డీ కొట్టడంతో బాలిక సుమారు పది అడుగుల ఎత్తుఎగిరి క్రిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు.స్థానికులు గాయపడిన వారిని చౌడేపల్లి ప్రాథమిక కేంద్రానికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు.





