*నేటి సాక్షి-మేడిపల్లి* వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి పగలు రాత్రి వేళలో ఉష్ణోగ్రతలు మారుతున్నందున రైతులు ముఖ్యంగా పంట పొలాలపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయ అధికారి ఎండి షాహిద్ అలీ రైతులతో కోరారు. జింక్ లోపం ఉన్న రైతులకు, జింక్ 12% edta స్ప్రే చేసుకోవచ్చు అని తెలిపారు. జింక్ లోపం వలన కుడా ఆకులు పసుపచ్చగా మారి పెరుగుదల మందగిస్తుందని తెలపడం జరిగింది. ఈ పరిశీలనలో నాయకులు దశరథ రెడ్డి, రైతులు రాజు, లింగారెడ్డి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.





