Sunday, March 8, 2026

మరికల్ లో బీఆర్ఎస్ రాస్తారోకో….. జెండాలతో నిరసనలు….. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి….. పేట బీఆర్ఎస్ జిల్లా నాయకులు నాయకులు వీర బసంత్ కుమార్…….. మరికల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య…

నేటి సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి 1,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు…. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారినిసిట్ విచారణ పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన గులాబీ పార్టీ అందులో భాగంగా నారాయణ పేట జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఎస్సార్ ఆదేశానుసారంగా మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర నిరస, రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీరబశాంత్ కుమార్, మరికల్ మండల అధ్యక్షులు లంబడి తిరుపతయ్య , మండల నాయకులు సురిటీ చంద్రశేఖర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక , కూలి పనులు చేస్తున్నారని వారు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నిలబెట్టుకోవాలని లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారి హెచ్చరించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దహన మరియు నిరసన కార్యక్రమాలు చేయాలని సర్పంచులు, వార్డు మెంబర్స్,మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువకులు, ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను మరికల్ సీఐ భగవంతు రెడ్డి, మరికల్ ఎస్సై రాములు నచ్చజెప్పి రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మండల నాయకులు కృష్ణారెడ్డి, బాలకృష్ణ సత్యరెడ్డి, గ్రామ వార్డు సభ్యులు శివకుమార్, రాఘవేందర్ గౌడ్, పి. నరసింహులు శ్రీనివాసులు, బాలకృష్ణారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సత్య రెడ్డి బాలప్ప, కే నర్సింలు గౌడ్ మహేష్, పసుపుల రాజ వర్ధన్ రెడ్డి, తిమ్మప్ప గౌడు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News