నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ : రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామా శివారులోని గుట్టలో స్వయంభువుగా వెలసిన శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేగుంట సాతారం, రామారావు పల్లె, గుండంపల్లి ,గ్రామాల నుండి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానము నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, గ్రామ సేవా సమితి అధ్యక్షులు అనుపురం చిన్న లింబాద్రి గౌడ్, మాజీ సర్పంచ్లు మరిపెళ్లి నారాయణ గౌడ్, సామల్ల లావణ్య వేణు, నాయకులు మోర హనుమాన్లు, ఏనుగు మల్లారెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, కొమ్ముల ఆదిరెడ్డి, మిట్టపల్లి రాంరెడ్డి, మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్, కొప్పెల మైపతి రెడ్డి, పుట్టుకం రాజారెడ్డి, ఓరగంటి లక్ష్మణ్, నాగిరెడ్డి నర్సారెడ్డి, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.





