నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : మాఘ మాసం శుక్ల పక్ష పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం సూర్య భగవానునికి అత్యంత పవిత్రమైన దినంగా హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ రోజున సూర్యదేవుని ఆరాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, విజయం, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి ప్రత్యేక పల్లకి సేవను నిర్వహించారు. పల్లకి సేవలో పాల్గొన్న ఆర్. యూ పిపి జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, ఇటిక్యాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ లను ఆలయ అనుసంధాన కర్త భారతాల రాజసాగర్, ఆలయ పూజారి శ్రీహరి లు ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రఫటం అందజేశారు. తదనంతరం భక్తులకు ఉచితంగా అమృత నిర్గుండి కశాయం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సూర్య భగవానుడికి ముడుపులు కట్టి తమ భక్తిని వ్యక్తం చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సత్సంగ సంధాన కర్తలు పెద్ది శ్రీనివాస్, భారతాల రాజసాగర్, ఎలిమిళ్ల సత్యనారాయణ, బీరెల్లి సత్యనారాయణ, ప్రవీణ్, విజయకుమార్, తిరుపతి, మాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీహరి స్వామి ప్రత్యేక పూజా విధులు నిర్వహించారు.





