నేటి సాక్షి2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు ఎన్నికల పనులలో నిమగ్నమై ఉన్నారని, ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించు వివరాలను పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుందని, ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు





