Wednesday, February 11, 2026

111 జీవోకు తూట్లు…!శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో ఇల్లీగల్ వెంచర్ దందా ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ప్రభుద్దులు, కళ్లుమూసుకున్న అధికార యంత్రాంగం.?రాజేంద్రనగర్..

.నేటి సాక్షి ఫిబ్రవరి:11. ప్రతినిధి శివకుమార్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో 111 జీవో పరిరక్షణ లక్ష్యాలకు బహిరంగంగా తూట్లు పొడుస్తూ అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మలచి విక్రయిస్తూ అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సంబంధిత భూములకు చట్టబద్ధ కన్వర్షన్, హెచ్ఎండిఏ/డీటీసీపీ లేఅవుట్ ఆమోదాలు లేకుండానే దర్జాగా వెంచర్ చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 111 జీవో పరిధిలో కఠిన నిబంధనలు ఉన్నా,మరి ఈ వెంచర్ ఎలా నడుస్తోంది.? ఎవరి ఆశీస్సులతో.? నడుస్తుందని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, రెవెన్యూ, పంచాయతీ,టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు.చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తుండడంతోఅధికారూలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News