Saturday, February 28, 2026

*రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం**ఎస్పీ మహేష్ బీ గీతే*

*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరం అశ్విని హాస్పిటల్స్ సహకారంతో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనాదారుడి సామాజిక బాధ్యత అని అన్నారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్లు కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్పష్టమైన చూపు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News