నేటి సాక్షి,నారాయణపేట, ఏప్రిల్ 14( రిపోర్టర్ ఇమామ్ సాబ్), మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో మరికల్ యువకమండలి ఆధ్వర్యంలో మంగళవారం నాడు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ను మరికల్ ఇన్చార్జి ఎస్ఐ మహేశ్వరి, మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్యలు ప్రారంభించారు. అనంతరం మంచినీటి అందిస్తున్న దాతకు యూవక మండలి ఆధ్వర్యంలో శాలువాతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి, మరికల్ యువకమండలి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లు, యువక మండలి సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





