Tuesday, April 14, 2026

*పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు – అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు*

నేటి సాక్షి 14 ఏప్రిల్ (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపకర్తగా దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి భారతీయుడికి ఆదర్శమని తెలిపారు.అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని పేర్కొన్నారు. విద్య, చైతన్యం, ఐక్యతతోనే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా మరియు ఘనంగా నిర్వహించబడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News