నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరం 6వరోజు మండల పరిధిలోని గూడూరు మరియు కృష్ణాపురం గ్రామాలలో గురువారం మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాల వినియోగం వల్ల, ఉత్పన్నమయ్యే దుష్ప్రభావాల గూర్చి, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు ఏ విధంగా దూరంగా ఉండాలో తెలియచెప్తు, అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున్ రెడ్డి, నాగరాజు, డాక్టర్ రవీందర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శ్రీను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ శ్రీనివాసరావు, స్వప్న మరియు ఎన్ఎస్ఎస్ వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.




