Saturday, April 25, 2026

విశారదన్ మహారాజ్ అరెస్ట్ కు నిరసన ఆర్ టీ సి కార్మికులకు మద్దతు.

నేటి సాక్షి వికారాబాద్ :బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ చైర్మన్ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్రమ అరెస్టును నిరసిస్తూ, బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా నాయకులు ధర్నా చెప్పటారు. నిన్న గురువారం నాడు RTC కార్మికుల హక్కుల సాధన కోసం వరంగల్ జిల్లా నర్సంపేట శంకర్ గౌడ్ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించి, కార్మికుల సమ్మెకు మద్దతుగా బయలుదేరిన విశారదన్ మహారాజ్ గారిని హౌస్ అరెస్ట్ చేసి అనంతరం పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది. విశారదన్ మహారాజ్ గారి అరెస్టు రాజ్యాంగ విరుద్ధం అని హక్కుల కోసం మాట్లాడే గొంతులను అణచివేయడం సరైనది కాదని వారు పేర్కొన్నారు. ఆర్ టీ సి కార్మికులు ఎలాంటి బలిదానాలు చేసుకోవద్దు. బలిదానాలు చేసుకొని తెలంగాణ రాజ్యం వాళ్ళకు అప్పగించాం, మరోసారి ఆ తప్పు మనం చేయొద్దు. ఆర్ టీ సి కార్మికులకు బీసీ ఎస్ సి,ఎస్ టీ జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు రవీందర్ మహారాజ్ అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మల్లికార్జున్, రాజు, శ్రీకాంత్, శేఖర్, సత్తయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News