నేటి సాక్షి , శంకర్ పల్లి; మే 05.శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ భద్రు, వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించాలని కోరారు. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. అవసరం వరకే రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడాలన్నారు. ప్రకృతిని కాపాడాలని కోరారు. పంట మార్పిడి పాటించి అధిక ఆదాయాన్ని పొందాలన్నారు. సాగునీటిని పొదుపుగా వాడి భావితరాలకు అందించాలన్నారు. మార్కెట్లో గిరాకిని పట్టి పంటలను పండించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాచన్న గారి రాఘవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ అంతారం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.





