నేటి సాక్షి నారాయణపేట,మే 5, (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సిహెచ్ ప్రియాంక గారిని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై కలెక్టర్‌తో ఎస్పీ చర్చించారు. జిల్లా అభివృద్ధికి పరస్పర సహకారంతో పనిచేయాలని,ప్రజల సంక్షేమం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇద్దరు అధికారులు అభిప్రాయపడ్డారు.





