నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )………………………………………మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మంగళవారం యాసంగి (రబీ) 2025-26 వరిధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ ) చేతన్ నితిన్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బి. ఎస్ లత, DSO జితేందర్ రెడ్డి, DM జితేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.*ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ*తెలంగాణ రైతులు ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పై నమ్మకంతో ఉన్నారని ఆ నమ్మకం నిలబడితే బాధ్యత సంబంధిత అధికారులు అందరిపై ఉన్నదని అందుకు అనుగుణంగా రైస్ మిల్లర్లు, సొసైటీ సీఈవోలు, ప్యాక్స్ చైర్మన్లు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అందరు సమన్వయంతో సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి యాసంగి (రబీ) 2025 – 26 విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. జగిత్యాల జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోడౌన్లలో స్టాక్ ఉన్నదని ఆ విషయం గమనించి సంబంధిత అధికారులు రైతులకు, మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సీజన్ కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని పలు సూచనలు అందించారు. సంబంధిత అధికారులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోళ్ల లో సమస్యలుంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలే కానీ రైతులను మిల్లుల వద్దకు పంపవద్దని అన్నారు. మిల్లుల వద్ద సమస్యలు ఉంటే అధికారులు మిల్లర్లతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. యాసంగి రబీ 2025 – 26 సీజన్ కు జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ప్యాడి వచ్చిందని అందరం కలిసి సమన్వయంతో సహకారంతో ముందుకెళ్లాలని సూచించారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా MRO, DT, CEO లు చర్యలు తీసుకోవాలని వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున హమాలీల కొరత ఉన్నదని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల వల్ల కొన్ని అడ్డంకులు ఉన్న కానీ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ తొందరగా చేయాలని అన్నారు.ఈ సమీక్ష సమావేశానికి వచ్చిన మిల్లర్స్, రైతు నాయకులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల అందరి సమస్యలు జిల్లా మంత్రిగా నాకు తెలుసు నిత్యం జిల్లాలో అందుబాటులో ఉంటూ ఈ సీజన్ కొనుగోలు పూర్తి అయ్యేవరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.మొక్కజొన్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్ల ఆర్థిక భారం భరిస్తుందని అన్నారు. రైతులకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉంటారని తెలిపారు. నిబంధన మేరకు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు పనిచేసి కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుల వద్దకు ధాన్యం వెనువెంటనే తరలించాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు, ఉన్నత అధికారులకు తెలియజేయాలని సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ఉన్నతాధికారులు స్పందించాలని అన్నారు. *జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ* గత సంవత్సర సమస్యలను అనుభవంగా తీసుకుని ఈ సంవత్సరం విజయవంతంగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెహికల్ ట్రాకింగ్ మరియు ఇతర నూతన నిబంధనల వల్ల ఈ సంవత్సరం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయినది అన్నారు. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం మిల్లులకు తరలించాలని అన్నారు. కేటాయించిన అధికారులు నిత్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ సకాలంలో కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. రైతు సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ* జగిత్యాల జిల్లాలో దాదాపు 440 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ స్థాయి IKP, PACS, DCMS, MEPMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో జాప్యంకు గల కారణాలను నిర్వాహకులను కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గన్నీల కొరత లేదని, ప్రస్తుతానికి 60 వేల క్యపాసిటీ స్టోరేజ్ ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికులకు సంబంధించిన 38 గోడౌన్లను ఇవ్వాలని సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు. జిల్లాలో హమలీల కొరత లారీ ట్రాన్స్పోర్ట్ కొరత ఉందని దృష్టికి వచ్చిందని అన్నారు. లారీల కొరత ఉన్నట్లయితే అందుబాటులో ఉన్న ట్రాక్టర్స్ ను ఉపయోగించుకోవాలని అన్నారు. అమాలీల కొరత ఉంటే ఉపాధి కూలీలను వినియోగించుకోవాలని తెలిపారు. మిల్లుల వద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వేరే మిల్లులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వేగవంతంగా కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని తగిన ముందస్తు ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలని అన్నారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ యాసంగి (రబీ) 2025 -26 వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు వివరించడం జరిగింది. అనంతరం రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు,CEO లు, DT లు, APM లు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తీరును, కొనుగోలు జరుగుతున్న తీరును స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బి. ఎస్ లత, DSO జితేందర్ రెడ్డి, DM జితేంద్ర ప్రసాద్, సంబంధిత శాఖ జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు, రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు, రైతు నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, CEO లు, DT లు, APM లు మరియు తదితరులు పాల్గొన్నారు.





