నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………..కేరళలో యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయం ప్రజా తీర్పుకు స్పష్టమైన నిదర్శనమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి లభించిన అపార ఆదరణ ఈ ఫలితాల్లో ప్రతిఫలించిందని, ఈ విజయం చారిత్రాత్మక మలుపు అని అడువాల జ్యోతి లక్ష్మణ్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, నాయకత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం వ్యక్తం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై, దాని నాయకత్వంపై ఉంచిన నమ్మకం ఈ ఫలితాల ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారానికి లభించిన అపార ఆదరణ ఈ విజయానికి ప్రధాన కారణమని, ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ విధానం ఫలితాన్ని అందించిందని ఆమె అన్నారు.ఈ విజయాన్ని చారిత్రాత్మక మలుపుగా అభివర్ణిస్తూ, యూడీఎఫ్ కూటమి నాయకత్వం సమన్వయంతో, కృషితో సాధించిన ఫలితమని కొనియాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ఇది ఒక కీలక సూచికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.అలాగే, ఈ గెలుపు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతుందని, రాబోయే ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.





