Tuesday, May 5, 2026

పత్రిక ప్రకటన, తేదీ: 05-05-2026, రంగారెడ్డి జిల్లా . మే 10న ప్రధానమంత్రి హైదరాబాద్ రాక

నేటి సాక్షి శంకర్పల్లి ఈ నెల 10వ తేదీన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హైద్రాబాద్ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కిరణ్మయితో కలిసి ఈ నెల 10వ తేదీన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హైద్రాబాద్ పర్యటన సందర్బంగా జిల్లా యంత్రాంగ చేపట్టవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సందర్బంగా సంబంధిత జిల్లా అధికారులు తమకు నిర్దేశించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ప్రధాని పర్యటన నిమిత్తం జిల్లాలో చేపట్టే ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి తప్పిదాలకు తవ్వివకుండా చేపట్టాలని సూచించారు. ఎక్కడ ఏ చిన్న పొరపాట్లు జరగకుండా చూడాలని, అందరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ట్రాన్స్ పోర్ట్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లా పౌర సంబంధాల అధికారి, రంగారెడ్డి జిల్లా గారిచే జారీ చేయనైనది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News